Teachers as Ministers: ఈ మహిళా మంత్రులంతా ఒకప్పటి టీచర్లే.! వీడియో..

|

Jun 23, 2024 | 12:12 PM

ఏపీలో టీచర్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏకంగా మంత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీ అంతట ఇదే ట్రెండ్ నడుస్తుంది.. తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పని చేశారు. అలాగే మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పని చేసినవారే.

ఏపీలో టీచర్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏకంగా మంత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీ అంతట ఇదే ట్రెండ్ నడుస్తుంది.. తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పని చేశారు. అలాగే మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పని చేసినవారే. దాంతో టీచర్లందరూ ఏపీలో మంత్రులు అవుతున్నారనే టాక్ బాగా వినిపిస్తుంది. ప్రస్తుతం వంగలపూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది తాజా మంత్రివర్గంలో కీలకమైన హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రి అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఏంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 28 సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012 లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

ఇక ఐదేళ్లపాటు సుదీర్ఘంగా మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే. తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీ రావు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. 1995లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, ఎంఈడి పూర్తి చేశారు మాజీ మంత్రి వనిత. తరువాత నల్లజర్ల లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె లెక్చరర్ గా పని చేశారు. అయితే తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన వనిత 2009లో టిడిపి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.  మరో మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయులుగా పనిచేశారు. 2004లో తండ్రి రాజకీయ వారసురాలిగా తొలిసారి ఆచంట నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో చింతలపూడి నుంచి గెలుపొంది చంద్రబాబు నాయుడి క్యాబినెట్‌లో స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఒకప్పటి టీచర్లంతా అనంతరం మంత్రుల అవతారం ఎత్తడం ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో ఇంకెంత మంది ఉపాధ్యాయులు మంత్రులు అవుతారో చూడాలి మరి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.