Telangana Election 2023: తెలంగాణలో తుది ఓటరు జాబితా విడుదల. 26 జిల్లాలు, 75 స్థానాలు.. మహిళలదే హవా.!
తెలంగాణలో తుది ఓటరు జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 26 లక్షల 18 వేల 205 మంది ఓటర్లు ఉన్నారు. 1 కోటి 62 లక్షల 98 వేల 418 మంది పురుష ఓటర్లు ఉన్నారు.. ఇక మహిళా ఓటర్ల విషయానికి వస్తే 1 కోటి 63 లక్షల 1 వెయ్యి 705 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2 వేల 676 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఓటర్లు నెల 30న జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
తెలంగాణలో తుది ఓటరు జాబితా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 26 లక్షల 18 వేల 205 మంది ఓటర్లు ఉన్నారు. 1 కోటి 62 లక్షల 98 వేల 418 మంది పురుష ఓటర్లు ఉన్నారు.. ఇక మహిళా ఓటర్ల విషయానికి వస్తే 1 కోటి 63 లక్షల 1 వెయ్యి 705 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2 వేల 676 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తుది ఓటర్ జాబితాను విడుదల చేశారు. ఓటర్లు నెల 30న జరిగే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే.. 26 జిల్లాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం విశేషం. ఏడు జిల్లాలు మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తిలలో మాత్రమే పురుష ఓటర్లది పైచేయి. మిగిలిన 26 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యగా ఉండటం విశేషం. రాష్ట్రంలోని మెుత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 75 స్థానాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 44 నియోజకవర్గాల్లో మాత్రమే పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించటంలో మహిళా ఓటర్లు కీ రోల్ ప్లే చేయనున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పురష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.