Telangana: సీఎం కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసీ అధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న లగ్జరీ బస్సును ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. భదాద్రి కొత్తగూడెంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొనేందుకు ఆయన వెళ్లుతుండగా ఈ తనిఖీలు జరిగాయి. వాహన సిబ్బంది పోలీసుల చెకింగ్స్‌కి పూర్తి స్థాయిలో సహకరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న లగ్జరీ బస్సును ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. ఎన్నికల ర్యాలీలో ప్రసంగించేందుకు కేసీఆర్ కొత్తగూడెం వెళ్తుండగా.. ఆయన వినియోగిస్తున్న ‘ప్రగతి రథం’ బస్సును ఈసీ అధికారులు పోలీసుల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అధికారులు, పోలీసు సిబ్బంది ప్రతి మూలను తనిఖీ చేస్తూ కనిపించారు. బ్యాగులు, బుట్టలు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే పెట్టెలను కూడా తెరిచి చూశారు. మరుగుదొడ్డిని కూడా తనిఖీ చేశారు.
ఈ మొత్తం తనిఖీలను పోల్ అధికారులు వీడియో రికార్డు చేశారు. రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి శనివారం కామారెడ్డికి వెళ్లిన సమయంలో ఆయన కారును కూడా ఎన్నికల అధికారులు చెక్ చేశారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, బిజెపి నేత బండి సంజయ్ కుమార్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీల కార్లను కూడా ఈసీ అధికారులు తనిఖీ చేశారు. 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

