Watch Video: తేడా రెండు శాతమే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మాజీ మంత్రి హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుంగిపోవాల్సిన అవసరం లేదని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రానున్న పంచాయితీ, ఎంపీ ఎన్నికల్లో సత్తా చూపించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్‌ఎస్ నాయకులది ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన దుష్ర్పచారాన్ని ప్రజలు నమ్మి, వారికి అవకాశమిచ్చారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో జరిగిన కృతజ్ఞత సభలో బీఆర్‌ఎస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ప్రజలు ఆశించినట్లు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మెరుగైన పాలన అందించాలని ఆశిద్దామన్నారు. కేవలం రెండు శాతం ఓట్లతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని.. అంత మాత్రన మనం తక్కువగా భావించాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజల పక్షా నిలుద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కోసం ప్రజల గొంతుకై అడుగుదామన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుంగిపోవాల్సిన అవసరం లేదని హరీశ్ అన్నారు. రానున్న పంచాయితీ, ఎంపీ ఎన్నికల్లో సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్‌ఎస్ నాయకులది ఎల్లప్పుడూ ప్రజల పక్షమే అన్నారు. 2009లో ఓడిపోయినా.. ఆ తర్వాత కేసీఆర్ ఎలా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో గుర్తించుకోవాలన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

