Telangana Assembly Speaker: తెలంగాణ సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపిక ఏకగ్రీవమైంది. స్పీకర్‌గా ఆయన పేరును కాంగ్రెస్ ప్రతిపాదించగా… ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. గడువు ముగిసే సమయానికి ఒకే నామినేషన్ దాఖలవడంతో… స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఎన్నిక ఖాయమైంది. రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు.. గడ్డం ప్రసాద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్లారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నామినేషన్ పత్రాలపై బీఆర్‌ఎస్ తరపున కేటీఆర్, ఎమ్మెల్యే కాలె యాదయ్య సంతకం చేశారు. గడ్డం ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.
అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఎన్నికను గురువారం ఉదయం సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించనున్నారు. అనంతరం, అన్ని పక్షాల నేతలు.. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారు. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..