Hyderabad: యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్, ఇతర మంత్రులు.. కేసీఆర్‌కు పరామర్శ
సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా పరామర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు సైతం ఆస్పత్రికి వచ్చారు. హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కేసీఆర్.
సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా పరామర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు సైతం ఆస్పత్రికి వచ్చారు. కాగా, గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆయన్ను యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు గాయం తీవ్రత నేపథ్యంలో హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కేసీఆర్. వాకర్ సాయంతో కేసీఆర్‌ను వైద్య బృందం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. 8 వారాల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 10, 2023 12:27 PM