CM KCR: నా తెలంగాణ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.. ఉప్పొంగి పోయిన కేసీఆర్.
అడుగడుగునా మహాద్భుతం. కళ్లు తిప్పనివ్వని కాకతీయ కళా కౌశలం.. ధగధగలాడే దక్కన్ నిర్మాణ చాతుర్యం.. ఆధునిక, సాంకేతికతల కలబోత.. సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబంబంగా నిలుస్తోంది.
నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభించారు. నూతన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి కొత్త భవనంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు సచివాలయ ప్రారంభం తన చేతుల మీదుగా ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ చూపిన మార్గంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అందరికీ జోహార్లు అర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే రాష్ట్రం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆయన చూపిన బాటలోనే ముందుకు సాగుతున్నామన్నారు. నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణం అని.. దీని నిర్మాణంలో అందరి కృషి ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!