తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోన్న చీకోటి లింకులు..(Video)
చీకోటి ప్రవీణ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. క్యాసినో వ్యవహారంలో పొలిటికల్ లింకులే ఎక్కువగా బయటపడుతున్నాయి. కోటి ప్రవీణ్ లిస్ట్‌లో తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కీలక నేతలు బయటకు వస్తున్నారు.
చీకోటి ప్రవీణ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. క్యాసినో వ్యవహారంలో పొలిటికల్ లింకులే ఎక్కువగా బయటపడుతున్నాయి. కోటి ప్రవీణ్ లిస్ట్‌లో తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కీలక నేతలు బయటకు వస్తున్నారు. లింకులు ఉన్న వాళ్లకు ఈడీ నోటీసులు ఇచ్చి ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తుండటంతో.. ఆయా నేతల్లో వణుకు మొదలైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్‌ని కూడా ఈడీ విచారించింది. ఈ యుగంధర్ రెడ్డికి పంజాగుట్టలో ఊర్వశి బార్ కూడా ఉంది. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించారనేది వీళ్లపై ఉన్న ఆరోపణ. చీకోటి కేసినోల్లో పాల్గొనడానికి విదేశాలకు వెళ్లారని.. హవాలా ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారణకు రావాల్సిందిగా ఈడీ ఆదేశించినట్టు సమాచారం.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

