చంద్రబాబు, పవన్‌ ఉమ్మడి ఎన్నికల ప్రచారం.. మరికాసేపట్లో తణుకులో రోడ్ షో..

|

Apr 10, 2024 | 6:12 PM

మరో నెల రోజుల్లో ఎన్నికలు.. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్ ఇవాళ, రేపు ఉభయగోదావరి జిల్లాలో రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కూటమి పొత్తు, సీట్ల సర్దుబాటు తర్వాత కేడర్‌లో..

మరో నెల రోజుల్లో ఎన్నికలు.. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్ ఇవాళ, రేపు ఉభయగోదావరి జిల్లాలో రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కూటమి పొత్తు, సీట్ల సర్దుబాటు తర్వాత కేడర్‌లో లుకలుకలు రావడంతో వాటిని చల్లార్చేందుకు ఉమ్మడి వ్యూహం రూపొందించారు. అసంతృప్తులను చల్లార్చి, కేడర్‌ను కలపాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తణుకులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు ఇద్దరు నేతలు. ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌ రోడ్డు మార్గాన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు. నిడదవోలు గణేష్‌చౌక్‌ సెంటర్‌లో రాత్రి రోడ్‌ షో నిర్వహిస్తారు. రేపు అమలాపురం, పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్‌ పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాల నేతలతో సమీక్షిస్తారు. ఆ తర్వాత అంబాజీపేట, అమలాపురంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పవన్‌ పాల్గొంటారు. అసంతృప్తులను చల్లార్చేందుకు ఉమ్మడి పర్యటనలకు ప్లాన్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్. కూటమి పోటీ చేస్తున్న కొన్ని స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడం.. కొన్ని చోట్ల రెబల్‌గా బరిలోకి దిగే అవకాశాలు ఉండడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow us on