Telangana: తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హైడ్రామా
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇరుపక్షాలు దూకుడు పెంచాయి. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బారీకేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బారీకేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. లోపల అసెంబ్లీలో నిలువరించడం, బయట నిలువరించడం ఏంటంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ నిరసనకు దిగారు. కంచెలు తొలగిస్తామని, అసెంబ్లీ దగ్గర కంచెలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకుముందు సీఎం రేవంత్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ చేశారు. అయితే కడియం శ్రీహరి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Feb 14, 2024 01:46 PM