Jubilee Hills bypoll: కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది

Edited By: Phani CH

Updated on: Nov 11, 2025 | 2:47 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. డబ్బు పంపిణీ జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎన్నికల సంఘానికి రుజువులతో సహా ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు పంపిణీ జరుగుతున్నప్పటికీ, పోలీసులు చోద్యం చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు కారు గుర్తు వందల స్పీడ్ తో దూసుకుపోతోందని, దీనిని చూసి తట్టుకోలేని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బుల సంచులతో వచ్చి బూతుల వద్ద విచ్చలవిడిగా డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారని బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాదాద్రీశుడికి భారీ ఆదాయం.. ఒక్కరోజు హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్.. ఊపిరి పీల్చుకున్న అమెరికన్లు

వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

50 మంది విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్..