AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

Phani CH
|

Updated on: Nov 11, 2025 | 1:53 PM

Share

ఫిలిప్పీన్స్‌ను కాల్మెగీ, ఫుంగ్-వాంగ్ తుఫాన్‌లు అతలాకుతలం చేశాయి. గంటకు 230 కి.మీ వేగంతో గాలులు, భారీ వర్షాలతో విస్తృత విధ్వంసం జరిగింది. ఇప్పటికే 200+ మరణాలు, 135 మంది గల్లంతయ్యారు. 3 కోట్ల మంది జీవితాలపై ప్రభావం పడింది. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్, రవాణా, మొబైల్ నెట్‌వర్క్‌లు స్తంభించాయి, దేశం తీవ్ర సంక్షోభంలో ఉంది.

వరుస తుఫాన్‌లతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం అవుతోంది. వారంలో రెండు తుఫాన్లు దేశాన్ని తీవ్రంగా వణికించాయి. కాల్మెగీ తుపాను ప్రభావంనుంచి ఇంకా కోలుకోకముందే, ఇప్పుడు ఫుంగ్-వాంగ్ తుపాను తీవ్రంగా భీభత్సం సృష్టిస్తోంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తుపాను కారణంగా తూర్పు, ఈశాన్య తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందారు. ఐతే ఇప్పటికే వణికించిన కాల్మెగీ తుపాను ధాటికి 200 మంది చనిపోగా.. 135 మంది గల్లంతయ్యారు. తుపాను ఉద్ధృతి కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలిపోవడంతో అనేక ప్రాంతాలు రోడ్డు మార్గాల నుంచి పూర్తిగా వేరుపడ్డాయి. అనేక ఇళ్లు, వాణిజ్య భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెల్ టవర్స్ దెబ్బతినడంతో మొబైల్ నెట్‌వర్క్‌లు కూడా నిలిచిపోయాయి. తుపాను సుమారు మూడు కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేయవచ్చని హెచ్చరించింది. ఇప్పటికే 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ప్రకటించారు. మరోవైపు పౌర విమానయాన శాఖ ఇప్పటికే 380కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. తుపాను కారణంగా రైల్వే, రోడ్డు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

50 మంది విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్..

అందెశ్రీ అందుకే చనిపోయారా ?? గాంధీ వైద్యులు సంచలన ప్రకటన

Kadapa: అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన కమెడియన్ అలీ, హీరో సుమన్

Jubilee Hills Bypoll Updates: పోలింగ్ బూత్ లకు రాని జూబ్లీహిల్స్ ఓటర్స్.. కారణం ఏంటి..?