50 మంది విద్యార్థులను కాపాడి ప్రాణాలు వదిలిన బస్ డ్రైవర్..
కోనసీమలో బస్సు డ్రైవర్ నారాయణరాజు గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. చాకచక్యంగా బస్సును ఆపి, 50 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను కాపాడారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించారు. ఈ వీరోచిత త్యాగం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. విద్యార్థులు తమను రక్షించిన డ్రైవర్‌ను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నారు.
ఎప్పటిలానే ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులతో బస్సు బయలుదేరింది. దారి మధ్యలో ఉండగా.. డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.. ఈ క్రమంలోనే.. చాకచక్యంగా వ్యవహరించాడు డ్రైవర్. వెంటనే బస్సును ఆపి డివైడర్ దగ్గర డ్రైవర్ కుప్పకూలాడు. డ్రైవర్ గురించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు. హుటాహుటిన వచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగింది. కొత్తపేట ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన దెందుకూరి నారాయణరాజు రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాల బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా సోమవారం ఉదయం విద్యార్థులను గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు బస్సులో తరలిస్తుండగా మడికి 216A జాతీయ రహదారిపై వెళుతుండగా డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యాడు. వెంటనే అలర్టయిన నారాయణ రాజుకు బస్సును పక్కకు ఆపి క్రిందకు దిగి జాతీయ రహదారి డివైడర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులు గమనించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షణాల్లో చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయాడు. డ్రైవర్ నారాయణరాజు తను చనిపోతూ 50 మంది విద్యార్థులను కాపాడడంతో మంచి డ్రైవర్ని కోల్పోయామంటూ.. కాలేజీ యాజమాన్యం, స్థానికులు పేర్కొన్నారు. విద్యార్థులతో గౌరవంగా ఉన్న నారాయణరాజు వారి కళ్ళ ఎదుటే చనిపోవడం విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమను రక్షించి డ్రైవర్ ప్రాణాలు విడవడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందెశ్రీ అందుకే చనిపోయారా ?? గాంధీ వైద్యులు సంచలన ప్రకటన
Kadapa: అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన కమెడియన్ అలీ, హీరో సుమన్
Jubilee Hills Bypoll Updates: పోలింగ్ బూత్ లకు రాని జూబ్లీహిల్స్ ఓటర్స్.. కారణం ఏంటి..?
Jubilee Hills Bypoll: డ్రోన్ కెమెరాలతో జూబ్లీహిల్స్ ఓటింగ్ పర్యవేక్షణ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

