జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలనుకుంటున్న KCR స్పీడు పెంచారు. టార్గెట్ బీజేపీ అంటున్న గులాబీ బాస్ ఢిల్లీలో మకాం వేసి మరీ ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్నారు. సంచలనాలు జరుగుతాయని KCR అంటే.. ఇదేమాట చెప్పిన చంద్రబాబు జూబ్లిహిల్స్‌కు పరిమితం అయ్యారని గుర్తుచేస్తున్నారు బీజేపీ నాయకులు. హస్తినలో గులాబీ చక్రం తిప్పుతుంటే.. కేసీఆర్ ముక్త్ తెలంగాణ అంటూ కమలదళాలు గర్జిస్తున్నాయి.