Big News Big Debate: రణరంగంగా మారిన కాంగ్రెస్ గాంధీభవన్.. రెండు వర్గాల మధ్య బాహాబాహి
గొడవలు పక్కనపెట్టి రండి సర్దుకుని కలిసికట్టుగా పోరాడదాం అని అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ వచ్చి మరీ గాంధీభవన్‌లో చర్చలు జరుపుతుంటే... బయట కేడర్ అబ్బే మా గొడవ మాదే అంటూ బాహాబాహికి దిగారు.
గొడవలు పక్కనపెట్టి రండి సర్దుకుని కలిసికట్టుగా పోరాడదాం అని అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ వచ్చి మరీ గాంధీభవన్‌లో చర్చలు జరుపుతుంటే… బయట కేడర్ అబ్బే మా గొడవ మాదే అంటూ బాహాబాహికి దిగారు. కాలర్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు… సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ అన్యాయం జరిగిందని గాంధీభవన్‌కి వచ్చిన ఓయూ విద్యార్థి సంఘం నేతలను ఉద్దేశించి ఎక్కడ అన్యాయం జరిగిందని నిలదీశారు మాజీ ఎమ్మెల్యే అనిల్. దీంతో రెండు వర్గాల మధ్య పెరిగిన మాటామాట పెరిగింది. గల్లాలుపట్టు మరీ ఒకరినొకరు నెట్టేసుకున్నారు. మధ్యలోకి వెళ్లి సర్దిచెప్పబోయిన మల్లు రవిని కూడా తోసేశారు. ఈ గొడవ ఇలా ఉంటే.. లోపల దిగ్విజయ్ సింగ్ వద్ద సీనియర్లు ఫిర్యాదులతో భారీగా నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పీసీసీ ఏకపక్ష నిర్ణయాలే లక్ష్యంగా ఫిర్యాదులు వెళ్లాయి. తామెందుకు పీసీస పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో అందరికీ తెలుసని.. ఇదే విషయం అధిష్టానం దృష్టికి తీసుకొచ్చామంటున్నారు.