Big News Big Debate: టీడీపీ-జనసేన మధ్య పొత్తు లేనట్టేనా ?? లైవ్ వీడియో
రోజుకో మలుపు తిరుగుతోంది ఏపీలో రాజకీయం . ఇంతకాలం పొత్తులతోనే వెళతామన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు వ్యూహం మార్చి అధికారం తనకే ఇవ్వమంటున్నారు. అటు జనసేనతో పాటు బీజేపీని కూడా కలుపుకుని పోతుందని భావిస్తున్న సమయంలో 175 సీట్లలో మనమే గెలవాలంటూ కేడర్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు-పవన్ మధ్య చెడిందని.. అందుకే పవన్ రోడ్లపైకి వచ్చారంటోంది వైసీపీ. ఇంతకీ రాష్ట్రంలో ఎవరికి వారే పోటీ చేయబోతున్నారా?
మూడు నెలల క్రితం వరకూ పొత్తులతోనే వెళతామని బలంగా చెప్పిన పవన్ కల్యాణ్ వ్యూహం మార్చారు. ఇప్పుడు సీఎం పదవి కావాలంటున్నారు. అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అత్యన్నతస్థానంలో నిలబెడతానంటూ హామీ ఇస్తున్నారు. ఒకప్పుడు సీఎం పదవి త్యాగానికి సిద్ధపడ్డ పవన్.. ఇప్పుడు సింగిల్‌గానే తలపడేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. పవన్ ప్రసంగాల తర్వాత అనూహ్యంగా టీడీపీ టోన్ కూడా మారింది. 175 సీట్లు గెలుపే లక్ష్యం అంటున్నారు చంద్రబాబునాయుడు. పార్టీ కార్యవర్గ విస్త్రృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ – చంద్రబాబు మధ్య సీట్ల వ్యవహారంలో తేడా వచ్చిందని అందుకే వారాహి రోడ్లపైకి వచ్చిందంటోంది వైసీపీ. టీడీపీ- జనసేన- బీజేపీ కలిసివచ్చినా.. విడిగా వచ్చినా వైసీపీ మాత్రంగా సింగిల్‌గానే రంగంలో దిగుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. జాతీయ పార్టీలతో పొత్తుల ప్రసక్తే లేదన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..
కలిసి స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లిన యువ జంట.. అంతలోనే..
పామును కసకసా నమిలి మింగిన జింక.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్