Big News Big Debate: సంక్షేమం ద్వారానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా..?? లైవ్ వీడియో
APలో అప్పులపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తుందా. విపక్షాలు చేస్తున్నట్టు అంత దయనీయంగా పరిస్థితులున్నాయా.? పేదల సంక్షేమానికి అప్పో సప్పో చేసి ఖర్చు చేస్తుంటే కుట్రలు చేస్తున్నారన్నది అధికారపార్టీ వాదన.
దేశంలో అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని.. ఆర్ధికంగా రాష్ట్రం దివాళ తీయడం ఖాయమంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అసెట్ క్రియేట్ చేయకుండా అప్పులు చేసుకుంటూ పోవడంపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసింది ఏపీ బీజేపీ. ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసింది కమల దండు. ఇటీవల ఆంధ్రా టూర్‌కు వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి AP ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం చేస్తున్న అప్పులనే ప్రధానాస్త్రంగా చేసుకుంది విపక్ష TDP. AP దివాళా తీసిందంటూ విమర్శలు చేస్తోంది. విపక్షాల ఆరోపణలకు ప్రభుత్వం ఘాటుగా స్పందిస్తోంది. విభజన నాటిని అప్పులపై వడ్డీలు 4వేల కోట్లు ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులకు 30వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
మరిన్ని ఇక్కడ చూడండి: Fake Jaggery: బెల్లం కాదు విషం.. ఈ విషయం తప్పక తెలుసుకోండి.. వీడియో
Delhi: ఢిల్లీలో నయాగరా జలం పాతం..!! వాటర్ ఫాల్ వీడియో వైరల్