Big News Big Debate: టార్గెట్ 2023 ఛాంపియన్ ఎవరు..? BJP వల.. BRS వ్యూహం.. కాంగ్రెస్ ఫైట్.. ఫలించేనా..?
కాంగ్రెస్‌ను ఆపరేషన్ ఆకర్ష్ గండం వెంటాడుతోందా.? కేసీఆర్ హఠావో నినాదం BJPకి ఓట్లు రాలుస్తుందా..? BRS వద్ద ఎన్నికలకు ఉన్న ఆయుధాలేంటి.?టార్గెట్ 2023 ఛాంపియన్ ఎవరు?
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందే నుంచే మూడు పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ పీక్‌లోకి చేరింది. మిషన్ 90 పేరుతో బీజేపీ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తే.. కాంగ్రెస్ కూడా నేతలకు కాపాడుకునేందుకు సరికొత్త వ్యూహాలతో వస్తోంది. పోటీ చేయడానికి కూడా బీజేపీకి నాయకులు లేరు.. తెలంగాణలో గెలిచేంత సీను లేదంటున్న బీఆర్ఎస్ 2023లో హ్యాట్రిక్ విజయం తమదేనంటోంది.కేసీఆర్‌ను ఓడించాలన్న లక్ష్యం బలంగా కనిపిస్తోంది. కానీ పోటీకి తగినంతమంది అభ్యర్ధులు లేరన్న చర్చ పార్టీలోనే ఉంది. దీనిపై ఫోకస్ పెట్టిన అధిష్టానం పెద్దలు చేరికల కమిటీని మరోసారి యాక్టివేట్ చేశారు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ మార్గదర్శకత్వంలో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేసి మరీ జనవరి నుంచి వచ్చే 10 నెలలకు కావాల్సిన కార్యాచరణ సిద్దం చేసి ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే.