Big News Big Debate: తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రకపంనలు.. కవిత విచారణపై ఉత్కంఠ..

|

Mar 08, 2023 | 7:02 PM

ఎక్కడో ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్‌ స్కామ్‌ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఈడీ కూడా

ఎక్కడో ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్‌ స్కామ్‌ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సీబీఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ తెలుగు ప్రజల్లో నెలకొంది. ఏకకాలంలో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థల్లో సీబీఐ కొందరిని ప్రశ్నించడానికి మాత్రమే పరిమితం అయితే.. ఈడీ మాత్రం ఇందుకు భిన్నంగా అరెస్టులు చేస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా అరెస్టు తర్వాత అందరి దృష్టి బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితపైనే ఉంది. అరుణ్‌ పిళ్లై రిమాండ్‌ రిపోర్ట్‌ నేపథ్యంలో ఆమెపై ఆరోపణలు మరింత బలపడ్డాయి. తాజాగా ఈడీ 9న విచారణకు రావాలని కూడా నోటీసులు ఇవ్వడంతో ఆమె అరెస్టుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఢిల్లీలో దీక్షకు సిద్ధమవుతున్నామని.. అది ముగిసిన తర్వాత ఎప్పుడైన విచారణకు సిద్ధమని కవిత ఈడీకి లేఖ రాశారు. అయితే ఈడీ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ వాతావరణం ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 08, 2023 07:02 PM