Andhra Pradesh: చిరంజీవి మద్దతు కూటమికి బలమవుతుందా..? ఎలక్షన్స్‌లో మెగాస్టార్‌ ఇంపాక్ట్‌ ఎంత?

|

Apr 22, 2024 | 7:35 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చిరుమంత్రం జపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. మెగాస్టార్‌ చిరంజీవి కూటమికే జై కొట్టడం పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు చిరంజీవి మావాడే అంటూ ఏపీ కాంగ్రెస్‌ నేతలు చెబుతుంటే... రాష్ట్రంలో కూటమి అధికారంలో రావాల్సిన అవసరం ఉందంటూ మెగాస్టార్‌ రిలీజ్‌ చేసిన వీడియో సంచలనం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చిరుమంత్రం జపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. మెగాస్టార్‌ చిరంజీవి కూటమికే జై కొట్టడం పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు చిరంజీవి మావాడే అంటూ ఏపీ కాంగ్రెస్‌ నేతలు చెబుతుంటే… రాష్ట్రంలో కూటమి అధికారంలో రావాల్సిన అవసరం ఉందంటూ మెగాస్టార్‌ రిలీజ్‌ చేసిన వీడియో సంచలనం రేపుతోంది. కూటమికి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులను చెరోవైపున కూర్చోబెట్టుకుని.. రాష్ట్రప్రజలను ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. మొత్తానికి మరోసారి.. ఏపీ రాజకీయ తెరపై మెగాస్టార్‌ బొమ్మ వెలిగిపోతోంది.

మరి, 2014 తర్వాత పాలిటిక్స్‌ను పక్కనపెట్టి.. సినిమాలపైనే ఫోకస్‌ పెట్టిన చిరంజీవి మేనియా.. వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందా? ఒకవేళ పనిచేస్తే అది ఎవరికి లాభం చేకూరుస్తుంది? ఎవరికి నష్టం చేస్తుంది? అన్నదే ఇప్పుడు పొలిటికల్‌గా డిబేటబుల్‌ పాయింట్‌..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..