Hyderabad: మోహన్ భగవత్ కు ఒవైసీ కౌంటర్..
ముస్లింలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింలు తమను తాము గొప్ప అనుకోవడం మానేయాలని చేసిన కామెంట్స్‌పై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.
ముస్లింలపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముస్లింలు తమను తాము గొప్ప అనుకోవడం మానేయాలని చేసిన కామెంట్స్‌పై అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో ముస్లింలు జీవించడానికి మోహన్ భగవత్ పర్మిషన్ అవసరం లేదంటూ ఘాటుగా స్పందించారు. ‘ఇండియాలో ముస్లింలు ఉండాలా? వద్దా? అని డిసైడ్ చేయడానికి మోహన్ భగవత్ ఎవరు?. మేము మత విశ్వాసాలను అనుసరించాలా? వద్దా? అని నిర్ణయించడానికి ఆయనెవరు? అల్లా ఆశీర్వాదం మేరకు మేము భారతీయులుగా పుట్టాం. మా పౌరసత్వంపై ఆంక్షలు విధించడానికి ఎంత ధైర్యం? మా విశ్వాసాల పట్ల మేమెప్పుడూ సర్దుకుపోం.
Published on: Jan 12, 2023 08:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos