Big News Big Debate: యువత చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. రణస్థలంలో జనసేనాని యుద్ధభేరి

Big News Big Debate: యువత చుట్టూ తిరుగుతున్న ఏపీ పాలిటిక్స్.. రణస్థలంలో జనసేనాని యుద్ధభేరి

Phani CH

|

Updated on: Jan 12, 2023 | 8:23 PM

ఏపీలోని పార్టీలన్నీ ఇప్పుడు యువతనే లక్ష్యంగా చేసుకున్నాయి. వారి ఓట్లే కీలకంగా భావిస్తున్నాయి. అందుకే పక్కా కార్యాచరణతో రంగంలో దిగాయి. రాష్ట్రంలో యువత మొత్తం వైసీపీకి అండగా ఉందని..

ఏపీలోని పార్టీలన్నీ ఇప్పుడు యువతనే లక్ష్యంగా చేసుకున్నాయి. వారి ఓట్లే కీలకంగా భావిస్తున్నాయి. అందుకే పక్కా కార్యాచరణతో రంగంలో దిగాయి. రాష్ట్రంలో యువత మొత్తం వైసీపీకి అండగా ఉందని.. గత ఎన్నికలే ఇందుకు నిదర్శమంటున్నాయి వైసీపీ వర్గాలు. ఎన్నికలకు యువతను సమాయత్తం చేసే బాధ్యతను బైరెడ్డి సిద్దార్దరెడ్డికి అప్పగించిన సీఎం.. అటు గ్లోబల్‌ సమ్మిట్‌ పేరుతో విశాఖలో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతకు ఉపాథి అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశం. అటు పార్టీ పరంగా.. ఇటు ప్రభుత్వ పరంగా యువతకు దగ్గరయ్యేలా సరైన ప్లాన్‌తో రంగంలో దిగింది వైసీపీ. జగనన్న పిలుపుతో ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామన్న బైరెడ్డి.. రాష్ట్రంలో ఉన్నది యువత కాదని జగనన్న సైన్యమంటున్నారు. జనవరి నుంచి యువగళం పేరుతో టీడీపీ ప్రధానకార్యదర్శి లోకేష్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో యువతను తమవైపు తిప్పుకునేందుకు ఇదో అవకాశంగా మలుచుకుంటున్నారు. 4వేల కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ప్రతినియోజకవర్గంలో ఉండే యువత లక్ష్యంగా ఆయన ప్రసంగాలు ఉండబోతున్నాయంటోంది పార్టీ.

Published on: Jan 12, 2023 08:23 PM