Watch Video: తెలంగాణ ప్రజలు ఛీ కొడితే.. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

|

Jan 27, 2024 | 11:54 AM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విమర్శల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జగన్ సర్కారుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల్లా కొందరు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విమర్శల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. జగన్ సర్కారుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల్లా కొందరు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. అయితే స్థానికత లేని అలాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఏపీలోకి షర్మిల వచ్చారన్నారు. ఏపీలో కాంగ్రెస్‌లోకి ఎవరువచ్చినా జీరోలే అవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగనన్న కు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ అభిమానులంతా జగన్ వెంటే ఉన్నారు ఉంటారని వ్యాఖ్యానించారు.

జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని.. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తోందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించే విషయంలో జగన్ కాంప్రమైజ్ కాలేదన్నారు. ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్‌కి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టిందని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూంలో కూచుని రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.