RK Roja: అందుకే సీఎం జగన్ రాజకీయాల్లో సూపర్ సక్సెస్.. మంత్రి రోజా ఆసక్తికర కామెంట్స్

|

Jan 12, 2024 | 1:32 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ కబుర్లు చెప్పరని.. ప్రజలకు ఉపయోగపడేది ఆచరణలో పెట్టి చూపిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సీఎం జగన్ యూత్ ఐకన్ అంటూ కొనియాడారు. యువత కూడా జగన్‌ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత కూడా శిఖరాలకు చేరాలని మంత్రి రోజా విద్యార్థులకు పిలుపు ఇచ్చారు.

ఏపీ సీఎం జగన్ తక్కువ మాట్లాడి.. ఎక్కువ పనిచేస్తారని.. అందుకే ఆయన రాజకీయాల్లో సూపర్‌ సక్సెస్‌ అయ్యారంటూ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడివెడు కబుర్ల కన్నా.. గరిటెడు ఆచరణ మిన్న అన్న.. స్వామి వివేకానంద స్ఫూర్తిని సీఎం జగన్ ఆచరిస్తున్నారని చెప్పారు. జగన్ కబుర్లు చెప్పరని.. ప్రజలకు ఉపయోగపడేది ఆచరణలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు. సీఎం జగన్ యూత్ ఐకన్ అంటూ కొనియాడారు. యువత కూడా జగన్‌ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత కూడా శిఖరాలకు చేరాలని మంత్రి రోజా విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విజయవాడలో శుక్రవారం జరిగిన జాతీయ యువజనోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.