Amaravati Farmers Vs JAC Live: రాజముండ్రిలో ఉద్రిక్తతం.. అమరావతి రైతులు Vs జేఏసీ.. (లైవ్)
అరసవిల్లి వైపు వెళుతున్న అమరావతి పాదయాత్ర ఆజాద్ చౌక్ మీదుగా వెళ్లింది. అక్కడే మూడు రాజధానులకు వ్యతిరేకంగా సభ పెట్టారు వైసీపీ నేతలు. ఎంపీలు మార్గాని భరత్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. సరిగ్గా పాదయాత్ర ఆజాద్ చౌక్‌కు రాగానే ఉద్రిక్తత మొదలైంది.
అమరావతి పాదయాత్ర రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజమండ్రి ఆజాద్ చౌక్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. వాటర్ బాటిల్స్, చెప్పులు విసురుకున్నారు. కుర్చీలను గాల్లోకి లేపి విసిరే ప్రయత్నం చేశారు. ఇరువైపులా ఒకరిని మరొకరు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. దాదాపు అరగంటసేపు ఆజాద్ చౌక్ రణరంగంగా మారింది. అరసవిల్లి వైపు వెళుతున్న అమరావతి పాదయాత్ర ఆజాద్ చౌక్ మీదుగా వెళ్లింది. అక్కడే మూడు రాజధానులకు వ్యతిరేకంగా సభ పెట్టారు వైసీపీ నేతలు. ఎంపీలు మార్గాని భరత్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు దీనికి హాజరయ్యారు. సరిగ్గా పాదయాత్ర ఆజాద్ చౌక్‌కు రాగానే ఉద్రిక్తత మొదలైంది. ఇరువైపుల వారు ఒక దగ్గరకు రాకుండా పోలీసులు పెద్దయెత్తున మోహరించారు. బారికేడ్లు పెట్టుకున్నారు. అయినా సరే ఇరు వైపుల వారు రెచ్చగొట్టుకునే విధంగా చేసుకుని చెప్పులు, వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. అరగంట తర్వాత పాదయాత్ర అక్కడి నుంచి ముందుకు కదలడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

