BJP Meeting: భైంసా శివారుల్లో బీజేపీ బహిరంగ సభ.. సభాస్థలికి బండి సంజయ్.. హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Video)

BJP Meeting: భైంసా శివారుల్లో బీజేపీ బహిరంగ సభ.. సభాస్థలికి బండి సంజయ్.. హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Video)

Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2022 | 4:32 PM

BJP Meeting: నిర్మల్ జిల్లాలో BJP సభకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో గుండెగాం నుంచి సభాస్థలికి బయల్దేరుతారు బండి సంజయ్. హైకోర్టు ఆదేశాల మేరకు భైంసా టౌన్‌..



నిర్మల్ జిల్లాలో BJP సభకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో గుండెగాం నుంచి సభాస్థలికి బయల్దేరుతారు బండి సంజయ్. హైకోర్టు ఆదేశాల మేరకు భైంసా టౌన్‌కు 4 కిలోమీటర్ల దూరంలో గణేష్‌ ఇండస్ట్రీస్‌ వద్ద సభ ఏర్పాటు చేశారు. చీఫ్‌ గెస్ట్‌గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాజరవుతారు. మీటింగ్ తర్వాత రెండో రోజు ప్రజాసంగ్రామ యాత్ర మొదలవుతుంది. 13.2 కిలోమీటర్ల మేర నడుస్తారు సంజయ్. కాగా, పాదయాత్రలో భాగంగా ఇవాళ గుండిగాం క్యాంప్ వద్ద బైంసా అల్లర్ల బాధితులను పరామర్శించారు బండి సంజయ్. బాధిత కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి ఈ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కావాల్సింది. కానీ నిన్న సభ వాయిదా పడటం.. ఈ రోజు కుదరకపోవడంతో ఆయన రావడం లేదు.

Published on: Nov 29, 2022 03:19 PM