గీ వార్త జూస్తె కొంతమంది కడ్పు మండుతుండొచ్చు. కండ్లల్లకేలి నీళ్లు తిరుగుతుండచ్చు.. గుండె పలిగిపోవచ్చు.. ఇంకొంతమందైతే పిచ్చోళ్లైనా ఐతుండొచ్చుల్లా.. ఎందుకట్లనంటె…? శానామంది అమృతం లెక్క ఫీలయ్యే ఓ ఔషదాన్ని పోలీసోళ్లు పట్టుకుంటుర్రు. పండ్గ పూటని సుత సూడకుంట పొట్టకొడ్తుర్రు పాపం. ఈ పోలీసులున్నారే.. మందుబాబులు పండ్గ జేస్కోకుంట ఒగటే అడ్డం వడ్తుర్రుపో. ఏమ్.. ఏవంత తప్పు జేశిర్రాళ్లు.
పండ్గకు పక్కరాష్ట్రాలకేలి మందు తీస్కచ్చుకుంటె వట్టుకుంటరా.? పండ్గ పూటని సుత సూడకుంట సీసాలు వట్కవోయి స్టేషన్ల వెట్టుకుంటె గాళ్లేమైపోవాలె. రాష్ట్రానికి ఖజానా నింపేటి మారాజ పోషకుల్ని లెక్కజెయ్యరా మీరు..? పండ్గనాడు సుత పట్టుకుంటుర్రని, పగవట్టి మందు బందు వెట్టిర్రే అనుకో రాష్ఠ్రం గతేంగావాలె. రాష్ట్రం రూపురేఖలు మార్శేటి మందుబాబుల మీదనా మీ ప్రతాపాలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..