పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
పీఎం కిసాన్ 20వ విడత నిధులను ప్రధాని మోదీ ఆగస్టు 2న విడుదల చేశారు.కానీ, ఇంకా వేలాది మంది రైతులకు ఈ నిధులు జమ కాలేదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన 20వ విడత నిధులు మీకు కూడా రాకపోతే.. డోంట్ వర్రీ. మీ ఆధార్ నంబరును.. బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయకపోవటం లేదా e-KYC చేయకపోవటం, మీ భూమి డాక్యుమెంట్లు సరిగా లేకపోవటం వల్ల పలువురికి నిధులు జమకావటం లేదని అధికారులు చెబుతున్నారు.
పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా లేదా ఇంటి నుండే e-KYC చేయవచ్చు లేదా సమీపంలోని CSC కేంద్రంలో బయోమెట్రిక్స్‌తో ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అప్పటికీ మీ సమస్య తీరకపోతే కిసాన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి మీ నిలిచిపోయిన వాయిదాను తిరిగి పొందవచ్చు. పీఎం కిసాన్ నిధులు పడకపోవటానికి పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద ఒక కుటుంబంలో ఒకరికే డబ్బులు పడతాయి. తమ పేరుతో భూమి ఉన్నప్పటికీ.. వివాహమై, ఉమ్మడి కుటుంబం నుంచి వేరు పడిన వారిలో చాలామందికి ఈ పథకం కింద డబ్బులు పడటంలేదు. కనుక వారు తమ రేషన్ కార్డులో నుంచి బయటికి వచ్చి వేరే రేషన్ కార్డు తీసుకొని.. పీఎం కిసాన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద డబ్బులు రావాలంటే.. E-KYC చేసుకోవటం తప్పనిసరి. మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింకై ఉంటే గనుక. మీరు ఇంట్లో కూర్చుని కూడా దీన్ని పూర్తి చేయవచ్చు. అందుకోసం PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in హోమ్‌పేజీలో కుడి వైపున ఉన్న e-KYC ఎంపికపై క్లిక్ చేయండి. మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్‌పై క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. ‘e-KYC విజయవంతంగా సమర్పించబడింది’ అనే సందేశం స్క్రీన్‌పై కనిపించిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు సమీపంలోని సీఎస్‌సీ కి వెళ్ళి అక్కడ మీ e-KYC బయోమెట్రిక్స్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ మీ సమస్య తీరకపోతే.. నేరుగా కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-1551 కు కాల్ చేయవచ్చు. ఇక్కడ నుండి మీరు సమస్యను పరిష్కరించుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి
పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే టూత్ పేస్ట్.. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ
మెగాస్టార్‌ను కలిసేందుకు కర్నూలు మహిళ సైకిల్ యాత్ర ఏకంగా 218కి.మీ తొక్కుతూనే..
Tamannaah Bhatia: తమన్నాకు అవమానం జాన్వీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్