AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్లాన్ B.. ఉస్తాద్ తర్వాత రీ ఎంట్రీ

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Dec 10, 2025 | 4:34 PM

Share

"ఉస్తాద్ భగత్ సింగ్" తర్వాత పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ ఇకపై నటనకు బ్రేక్ ఇచ్చి నిర్మాణ రంగంపై దృష్టి సారించనున్నట్లు కథనం. "పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్" బ్యానర్‌పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాలు నిర్మించే ఆలోచనలో పవర్ స్టార్ ఉన్నారని, ఇది ఆయన 'ప్లాన్ B' అని తెలుస్తుంది. రాజకీయాలతో పాటు నిర్మాతగా బిజీ కానున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి..? కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేదంటే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి సైలెంట్‌గా పక్కకు తప్పుకుంటారా..? ఈ రెండూ కాదంటే ప్లాన్ B ఏదైనా సిద్ధంగా ఉందా..? చూస్తుంటే ఇదే జరిగేలా ఉంది. ఎప్పట్నుంచో చెప్తున్న మాటను.. ఉస్తాద్ తర్వాత అప్లై చేసేలా ఉన్నారు పవర్ స్టార్. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? OG తర్వాత సినిమాలపై పవన్ కళ్యాణ్ అప్రోచ్ మారిపోయింది.. అంతకుముందు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదనేవారు. కానీ ఓజికి వచ్చిన రియాక్షన్స్ చూసాక.. సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని మాటిచ్చారు. కాకపోతే అదిప్పుడే ఉండకపోవచ్చు. అందుకే సుజీత్ కూడా నానితో సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్నారు పవర్ స్టార్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పవన్ పోర్షన్ ఎప్పుడో పూర్తైపోయింది. డిసెంబర్‌లోనే ఫస్ట్ సింగిల్ రానుంది. 2026 సమ్మర్‌లో ఉస్తాద్ వస్తున్నాడు.. దీని తర్వాత పవన్ ప్లాన్ ఏంటనేదే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఎలాగూ రాజకీయాల్లో బిజీగానే ఉంటారు జనసేనాని. ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్ మళ్లీ మొదలుపెట్టాలని చూస్తున్నారు పవర్ స్టార్. నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌పై సినిమాలు నిర్మించే ఆలోచన చేస్తున్నారు పవన్. ఇప్పటికే కొన్ని కథలు ఫైనల్ అయ్యాయని తెలుస్తుంది. గతంలో పవన్‌తో బ్రో సినిమా నిర్మించారు టీజీ విశ్వప్రసాద్. హీరోగా నటించినా నటించకపోయినా నిర్మాతగా ఉంటానని ఎప్పుడో చెప్పారు పవన్. ప్రొడక్షన్ అయితే తనే ఉండాల్సిన పనిలేదు కాబట్టి అటువైపు అడుగేస్తున్నారు పవన్. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో సర్దార్ గబ్బర్ సింగ్‌తో పాటు.. త్రివిక్రమ్‌తో కలిసి నితిన్ ఛల్ మోహన్ రంగాను నిర్మించారు PK. మొత్తానికి ఉస్తాద్ తర్వాత ప్లాన్ B సిద్ధంగా ఉంచుకున్నారు పవర్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే

స్క్రిప్ట్‌తో రండి, సినిమా పూర్తి చేసుకెళ్లండి.. సినిమావారికి CM ఆఫర్

అఖండ-2 రిలీజ్‌ ఎఫెక్ట్‌.. బాధలోకి మోగ్లీ డైరెక్టర్

8 ఏళ్ల తరువాత హీరోయిన్‌పై లైంగిక ఆరోపణల కేసు నుంచి హీరోకు విముక్తి

మనసుల్ని గెలిచిన ఇండిగో పైలట్‌.. ఒక్క మాటతో