ఏ క్షణాన ఏమవుతుందో ?? ఊపిరి బిగబట్టిన గ్రామస్థులు

Updated on: Jan 07, 2026 | 6:34 PM

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలసలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సుమారు 70 ధాన్యం బస్తాలను ధ్వంసం చేసి రైతులను ఆవేదనకు గురి చేసింది. ఏనుగుల బెడదతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. వీటిని అడవిలోకి తరలించాలని బాధితులు కోరుతున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు ఇటీవల తీవ్ర ఆందోళన కలిగించింది. కొమరాడ మండలం గంగరేగు వలస ప్రాంతంలోకి ప్రవేశించిన ఏనుగులు భారీ విధ్వంసం సృష్టించాయి. గ్రామస్థులు ఊపిరి బిగబట్టి భయాందోళనలో గడిపారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ఆందోళన చెందారు. ఈ ఏనుగుల గుంపు రైతుల ధాన్యం బస్తాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేసింది. సుమారు 70 ధాన్యం బస్తాలను పూర్తిగా నేలపాలు చేసి, చిందరవందర చేశాయి. దీంతో అప్పటికే పంట చేతికి వచ్చి, ధాన్యం నిల్వ చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమ శ్రమను, పంటను ఏనుగులు నాశనం చేయడంతో బాధితులైన రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు

ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు

Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే

ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!

ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ