వింటర్‌లో ఇవి తింటే.. బాడీకి ఫుల్ పవర్
చలికాలం వచ్చేసింది. అప్పుడే చలి పులి పంజా విసురుతోంది. వింటర్‌లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పుల నుంచి గుండె నొప్పుల వరకూ ఎటాక్ చేస్తాయి. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. వేరుశెనగ పప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు.
వేరుశనగ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనిలో ప్రోటీన్, విటమిన్లు అధికంగా లభిస్తాయి. వేరుశనగలో ఉండే ప్రోటీన్స్ చలికాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేరుశెనగలో మోనోఅన్శాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వేరుశనగ పప్పులను తినవచ్చు. అలసినట్లు అనిపించడం, నిద్రమత్తుగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తే తక్షణ శక్తి కోసం కాసిన్ని వేరుశెనగ పలుకులు తింటే సరి. శీతాకాలంలో తరుచూ వేరుశనగలు తీసుకోవడం వల్ల శరీరంలో ఎముకలను బలోపేతం చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వేరుశనగల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలపు అలసట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడేం దొంగరా బాబు.. ఇంత ట్యాలెంటడ్ గా ఉన్నాడు
మోక్షు హీరోగా ‘ఆదిత్య 369’ సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన హీరో.. ఏంటీ పిచ్చి నిర్ణయం
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంచు మనువరాళ్లు.. ఖుషీగా తాత మోహన్ బాబు
TOP 9 ET News: థియేటర్స్‌లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ మెంటలెక్కిపోతున్న ఆడియెన్స్