ఇళ్లలోకి దూరి భయభ్రాంతులకు గురి చేస్తున్న వానరాలు

Updated on: Dec 29, 2025 | 8:08 PM

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జంతువుల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముత్యాలలో కోతులు ఇళ్లలోకి చొరబడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నెల రోజుల్లో కుక్కలు, కోతులు, పిల్లుల దాడిలో 206 మంది గాయపడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ప్రజలు ఈ బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలో జంతువుల దాడులు ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ముత్యాలలో వానరాల బెడద శృతిమించిపోతోంది. ఇళ్లలోకి దూరి మరీ మనుషులపై దాడి చేస్తున్న కోతుల ఆగడాలు మితిమీరాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు, కుక్కల దాడులతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ దాడులకు పిల్లులు, ఎలుకలు కూడా తోడయ్యాయి. గత నెల రోజుల్లో ఈ ప్రాంతంలో జంతువుల దాడులకు గురైన వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది. గణాంకాల ప్రకారం, 156 మందిని కుక్కలు కరిచాయి. 38 మందిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Thalapathy Vijay: అభిమానుల కోరిక మేరకు స్టేజ్ పై విజయ్ స్టెప్పులు

హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక

Srisailam: శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన

CM Revanth Reddy: అసెంబ్లీ లో అదిరే సీన్.. KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి

న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత