బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ భారీ విరాళం వీడియో

Updated on: Jun 24, 2025 | 9:15 PM

హైదరాబాద్ లోని ప్రసిద్ధ బాలకంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం బుధవారం నాడు దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమయింది. త్వరలో ఆషాఢమాసం రానుంది. భాగ్యనగరం భోనాలు సంబరాలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బల్కంపేట అమ్మవారి ఆలయం కూడా ముస్తాబవుతుంది. ఎల్లమ్మ పోచమ్మకి నీతా అంబానీ అందించిన కోటి రూపాయల విరాళాన్ని బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ఈవో మహేందర్ గౌడ్ చెప్పారు.

నీతా అంబానీ సమయం దొరికినప్పుడల్లా దేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటూ ఆయా ఆలయాల అభివృద్ధికి భారీ విరాళం అందిస్తూ ఉంటారు. నీతాకు ఎల్లమ్మ అమ్మవారు అంటే అమితమైన భక్తి నమ్మకం. ఎప్పుడూ హైదరాబాద్ వచ్చిన ఆమె ఎల్లమ్మ అమ్మవారిని దర్శించకుండా వెళ్ళరు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే సమయంలో నీతా తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ ఆమె తల్లి పూర్ణిమా దలాల సోదరి మమతా దలాలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో అప్పటి ఆలయ ఈవో ఆలయ విశిష్టతను ప్రాముఖ్యతను వివరించారు. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించాలని ఆయన వారిని కోరారు. ఆలయ యాజమాన్యం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ ఇప్పుడు కోటి రూపాయల విరాళాన్ని అందించారు.

మరిన్ని వీడియోల కోసం :

జ్యుయలరీ షాపునకు వెళ్లిన 93 ఏళ్ల వృద్ధుడు..అతను అడిగింది విని యజమాని ఫిదా వీడియో

చిరుతకే ఝలక్‌ ఇచ్చిన గ్రామ సింహం..ఎలా తప్పించుకుందంటే వీడియో

వద్దు నాన్నా.. భయమేస్తోంది వీడియో