ఫాస్టగ్ కొత్త రూల్స్.. ఇంతకీ .. కేవైసీ అప్‌డేట్ చేశారా ??

|

Aug 05, 2024 | 9:21 PM

ప్రస్తుత కాలంలో కార్లతోపాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్‌ట్యాగ్ వాడకం తప్పనిసరి అయింది. ఫాస్టాగ్ లేని పక్షంలో టోల్ ప్లాజా దగ్గర టూ వీలర్ మినహా ఏ వాహనమైనా కూడా టోల్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ కోసం ఆగస్టు 1, 2024 నుంచి కొత్త నిబంధనలను అమలు చేసింది .

ప్రస్తుత కాలంలో కార్లతోపాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్‌ట్యాగ్ వాడకం తప్పనిసరి అయింది. ఫాస్టాగ్ లేని పక్షంలో టోల్ ప్లాజా దగ్గర టూ వీలర్ మినహా ఏ వాహనమైనా కూడా టోల్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్టాగ్ కోసం ఆగస్టు 1, 2024 నుంచి కొత్త నిబంధనలను అమలు చేసింది . వీటి ప్రకారం ఫాస్టాగ్‌కు KYCని అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ప్రధానంగా మూడు సంవత్సరాల సమయమున్న ఫాస్టాగ్‌లు KYC పూర్తి చేయడం తప్పనిసరిగా పేర్కొన్నారు. ఫాస్టాగ్ వినియోగదారులు వారి KYC వివరాలను అక్టోబర్ 31లోపు అప్‌డేట్ చేసుకోవాలి. ప్రత్యేకించి వారి Fastag 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటే తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. దీంతోపాటు 5 సంవత్సరాల కంటే పాతదైన ఫాస్ట్‌ట్యాగ్‌ని కూడా మార్చుకోవడం అవసరం. వినియోగదారులు వారి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, ఛాసిస్ నెంబర్‌ను ఫాస్టాగ్‌తో లింక్ చేసుకోవాలి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారు కొన్న 90 రోజులలోపు వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో తమ ఫాస్టాగ్‌ను అప్‌డేట్ చేయాలి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ismart News: కూటమి పార్టీల అధికారం కోసం అరగుండు మొక్కు