కరోనా ఉపద్రవం మళ్లీ స్టార్ట్ !! వారంలో రోజుల్లో గణనీయంగాపెరిగిన కేసుల సంఖ్య

|

May 21, 2024 | 8:34 PM

సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. మనం మరో కొవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, కొవిడ్ కారణంగా రోజూ ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది.

సింగపూర్‌లో మరో కరోనా ఉపద్రవం మొదలైంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. మనం మరో కొవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, కొవిడ్ కారణంగా రోజూ ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది. అంతకు ముందు వారంలో ఇది 181గా ఉంది. ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది. మరోవైపు, అవసరమైన సందర్బాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు. మొబైల్ ఇన్‌పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లల్లోనే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు, ఇతరులు, అదనపు కొవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Spicy Chip Challenge: బాలుడి ప్రాణం తీసిన ఘాటైన చిప్‌ ఛాలెంజ్‌..

అదృశ్యమైన నటుడు.. 24 రోజుల తర్వాత ఇంటికొచ్చాడు

అతని అకౌంట్లోకి రూ.9,900 కోట్లు !! వచ్చిపడ్డాయి.. ఎలా అంటే ??