AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం

చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం

Phani CH
|

Updated on: Oct 11, 2026 | 9:24 AM

Share

నల్లమల అడవుల్లో ఎలుగుబంట్ల ఆహారపు అలవాట్లపై జరిగిన ఒక పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సాధారణంగా చీమలు, చెదపురుగులు, తేనె, పండ్లను మాత్రమే తింటాయని భావించే ఎలుగుబంట్లు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాములను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

నల్లమల అడవుల్లో ఎలుగుబంట్ల ఆహారపు అలవాట్లపై జరిగిన ఒక పరిశోధన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సాధారణంగా చీమలు, చెదపురుగులు, తేనె, పండ్లను మాత్రమే తింటాయని భావించే ఎలుగుబంట్లు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాములను కూడా తమ ఆహారంలో చేర్చుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ టైగర్ కన్సర్వేషన్ సొసైటీ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ బయోలాజికల్ ల్యాబొరేటరీ పరిశోధకులు 18 నెలల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. జూలై 2021 నుంచి డిసెంబర్ 2022 వరకు సేకరించిన 143 ఎలుగుబంటి మల నమూనాల్లో ఐదు నమూనాల్లో పాము అవశేషాలు కనిపించాయి. ప్రధానంగా యూరోపెల్టిస్ ఎలియోటి (షీల్డ్-టెయిల్‌డ్ స్నేక్) జాతికి చెందిన పాములను ఎలుగుబంట్లు తిన్నట్లు గుర్తించారు. వర్షం పడిన తర్వాత నేల మెత్తబడినప్పుడు, ఎలుగుబంట్లు తమ బలంగా ఉండే గోళ్లతో చీమలు, పురుగుల కోసం తవ్వుతాయి. ఈ ప్రక్రియలో అనుకోకుండా నేల లోపల నివసించే షీల్డ్-టెయిల్‌డ్ పాములు బయటపడి, ఎలుగుబంట్ల ఆహారంగా మారుతాయి. ఇది ఎలుగుబంట్లు పాములను ప్రత్యేకంగా వేటాడటం కాదని, ప్రకృతిలో జరిగే ఒక ఆకస్మిక పరిణామం అని పరిశోధకులు తెలిపారు. ఎలుగుబంట్ల ఆహారం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందని, అందుబాటులో ఉన్నదాన్ని బట్టి అవి తమ మెనూని మార్చుకుంటాయని ఈ అధ్యయనం నిరూపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!

షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!

షాకింగ్‌ న్యూస్‌.. రైస్‌ ధరలు పెరుగుతున్నాయ్‌!

హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

Published on: Oct 11, 2026 09:22 AM
Follow Us