తిరుపతిలో గ్రాండ్‌గా..మహా సిమెంట్స్‌ డీలర్స్ యాన్యువల్ మీట్ వీడియో

Updated on: Sep 13, 2025 | 3:25 PM

సిమెంట్ వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మై హోం గ్రూప్స్ మహా సిమెంట్స్ నెట్‌వర్క్ దక్షిణాదిలో శరవేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రారాజుగా వెలుగొందుతోంది. ఆవిర్భవించిన అనతికాలంలోనే నాణ్యత, సప్లై విషయంలో కస్టమర్ల ప్రశంసలు అందుకుంటూ సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో, సెప్టెంబరు 12న ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని ఫార్చూన్‌ హోటల్‌లో వార్షిక డీలర్స్ సమావేశం ఘనంగా జరిగింది.

‘మహా కుటుంబం’ పేరుతో శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో మహా సిమెంట్స్ మార్కెటింగ్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌రావు, మార్కెటింగ్‌ జీఎం చిట్టిబాబు, రీజినల్‌ హెడ్‌ విజయశేఖర్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తిరుపతి రీజియన్‌కు చెందిన మహా సిమెంట్ డీలర్లంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహా సిమెంట్స్ సేల్స్ లో ప్రతిభ చూపిన డీలర్లకు ఈ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ఏకకాలంలో 6 రంగాల్లో మై హోమ్ గ్రూప్ దిగ్విజయంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్నదని ఏపీ, తెలంగాణ టెక్నికల్‌ హెడ్‌ ప్రసాద్‌ తెలిపారు. మై హోం గ్రూప్‌ ఇప్పటి వరకు 30కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసిందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో

ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్‌ ఐడియా వీడియో

ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో

హైదరాబాద్‌ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో