మూసారాంబాగ్ బ్రిడ్జి ఉండేది అనుమానమే..
హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జి పటిష్ఠతపై అనుమానాలు నెలకొన్నాయి. మూసారాంబాగ్ పాత బ్రిడ్జికి దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. మొన్నటి మూసీ వరదకు మూసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నది. బ్రిడ్జి రెయిలింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రెయిలింగ్ నిర్మాణం తర్వాత కూడా రాకపోకలపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జి పటిష్ఠతపై అనుమానాలు నెలకొన్నాయి. మూసారాంబాగ్ పాత బ్రిడ్జికి దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉంది. మొన్నటి మూసీ వరదకు మూసారాంబాగ్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిన్నది. బ్రిడ్జి రెయిలింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రెయిలింగ్ నిర్మాణం తర్వాత కూడా రాకపోకలపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి లోగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చే యోచనలో ఉంది. మూసారాంబాగ్ బ్రిడ్జి పటిష్టతను నిపుణులు పరిశీలించారు. వరదలకు బ్రిడ్జి పిల్లర్ల కింద ప్రాంతం దెబ్బతినడంతో అధికారులు ఇంటర్నల్ ఎంక్వయిరీ చేశారు. పరిశీలన తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా బ్రిడ్జి పటిష్టతపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక.. మొబైల్ తరహాలో గ్యాస్ పోర్టబులిటీ
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 10 రోజుల్లో 2 కొత్త పథకాలు
బేడీలు వేసి..గొడ్డు మాంసం పెట్టి.. 73 ఏళ్ల మహిళ కన్నీటి పర్యంతం
