AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 11:10 AM

Share

ముంబైకి చెందిన ఓ యువతి అర్ధరాత్రి క్యాబ్‌ ప్రయాణంలో ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. రాత్రి 2 గంటలకు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు బుక్‌ చేసుకున్న క్యాబ్‌ను మహిళా డ్రైవర్‌ నడపడంతో ఎంతో ప్రశాంతంగా ప్రయాణించానని తెలిపారు. సాధారణంగా రాత్రివేళ ఒంటరిగా వెళ్లేటప్పుడు ఉండే భయం ఆ ప్రయాణంలో కలగలేదని చెబుతూ.. ‘ఈ రోజు నాకు మగాడిలా అనిపించింది’ అని చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్‌గా మారింది.

అర్ధరాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మహిళలు ఆందోళన చెందడం, భయపడటం సహజం. అయితే ముంబైకి చెందిన ఓ యువతి రాత్రి సమయంలో క్యాబ్‌లో ప్రయాణించిన తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ యువతి ఇటీవల రాత్రి 2 గంటల సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగి, ఇంటికి వెళ్లేందుకు ఒక క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ఆ క్యాబ్‌ను ఒక మహిళా డ్రైవర్ నడుపుతున్నారు. ఈ ప్రయాణం పూర్తి కాగానే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.. “ఈ రోజు నాకు మగాడిలా అనిపించింది” అని వ్యాఖ్యానించారు. సాధారణంగా రాత్రివేళల్లో ప్రయాణించేటప్పుడు మహిళలు తమ భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఫోన్ సరి చూసుకోవడం, కుటుంబ సభ్యులకు ఆ లొకేషన్‌ పంపడం లేదా వారితో మాట్లాడుతున్నట్లు నటించడం వంటివి చేస్తుంటారు. కానీ మహిళా డ్రైవర్ ఉన్న క్యాబ్‌లో ప్రయాణించడం వల్ల తనకు ఎలాంటి ఆందోళన కలగలేదని, ఎంతో ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా వెళ్లానని ఆ యువతి తెలిపారు. భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేకుండా ప్రయాణించడం ఎంత స్వేచ్ఛగా ఉంటుందో ఈ ఘటన ద్వారా అర్థమైందన్నారు. పురుషులకు ఎలాంటి భయాలు ఉండవని చెప్పడం తన ఉద్దేశం కాదని, కేవలం భద్రతా భావం ఉన్నప్పుడు కలిగే స్వేచ్ఛను వివరించడానికే అలా అన్నానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో రాత్రివేళల్లో మహిళల భద్రత, వారు తీసుకునే జాగ్రత్తలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

543 రకాల ఔషధాల ధరలు భారీగా తగ్గింపు..

Follow Us