రైల్లో నుంచి దూకి చనిపోదాం అనుకున్నా స్టార్ హీరోయిన్..ఎందుకంటే?

Updated on: Jul 13, 2025 | 8:12 AM

సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది మృణాల్ ఠాకూర్. ఈ టాలెంటెడ్‌ నటి సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కష్టాలను బయటపెట్టింది. సినిమాల్లో అవకాశాలు లేక ఇబ్బందులు ఎదురైనట్లు డిప్రెషన్‌తో పోరాడిన‌ట్టు చెప్పుకొచ్చింది. ఒకసారి ముంబైలో లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని కూడా ఆలోచించాన‌ని చెప్పింది. అయితే పేరెంట్స్ గుర్తొచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అంది. ప్ర‌స్తుతం మృణాల్ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

మృణాల్‌కి చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి ఎక్కువట. టీవీలో కనిపించాలన్నది ఆమె జీవితాశయం. అయితే పేరంట్స్‌ డెంటిస్ట్ అవ్వాలని అనేవారట. వారిని ఒప్పించి మీడియా స్టడీస్‌లో డిగ్రీ చేసింది. బీబీఎంలో చేరిందే కానీ ఆ సబ్జెక్ట్‌ ఏ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉండేది కాదని ఏం చేయాలో తోచక అర్థమయ్యేది కాదని చెప్పుకొచ్చింది. సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది మృణాల్. ఆ తర్వాత హిందీలో ‘సూపర్ 30’, ‘జెర్సీ’ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో ‘సీతారామం’లో నటించి త‌న క్రేజ్ మరింత పెంచుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ కలిపి సుమారు అరడజను సినిమాలు చేస్తుంది.. ఇందులో అడివి శేష్‌తో ‘డెకాయిట్’, అల్లు అర్జున్, అట్లీతో కలిసి పనిచేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది.. రష్మిక ఎమోషనల్ వీడియో

అమ్మో సింహం.. కాదు కాదు.. శునకం వీడియో

రాత్రి ఇలా నిద్రపోతే.. మీ గుండెకు ముప్పే వీడియో

ఆకాశంలో అద్భుత దృశ్యం వీడియోలో చూడండి మరి!

Published on: Jul 13, 2025 07:55 AM