Rajahmundry: రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎంపీ భరత్.. అన్నీ తానై సహకరించిన మార్గాని..

Edited By:

Updated on: Oct 01, 2023 | 9:01 PM

Rajahmundry: రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలోని బాధితులకు అండగా నిలిచారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ప్రమాదంలో భార్యను పోగోట్టుకుని, తీవ్రంగా గాయపడిన కొడుకు దుస్థితిని చూసి.. అదుకునే నాధుడు ఎవరైనా ఉన్నారా అని విలపిస్తున్న రమణ అనే వ్యక్తి కుటుంబానికి అన్నీ తానై సహకరించారు భరత్. రాజమండ్రి నుంచి ఓ శుభకార్యానికి వెళ్తున్న ఎంపీ భరత్.. రమణ పాలిట దైవంగా మారారు. నిముషాల వ్యవధిలో అక్కడకు అంబులెన్స్‌ని పిలిపించి.. రమణ కుటుంబాన్ని ఆసుపత్రికి తరలించారు.

రాజమండ్రి, అక్టోబర్ 01: రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలోని బాధితులకు అండగా నిలిచారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. ప్రమాదంలో భార్యను పోగోట్టుకుని, తీవ్రంగా గాయపడిన కొడుకు దుస్థితిని చూసి.. అదుకునే నాధుడు ఎవరైనా ఉన్నారా అని విలపిస్తున్న రమణ అనే వ్యక్తి కుటుంబానికి అన్నీ తానై సహకరించారు భరత్. రాజమండ్రి నుంచి ఓ శుభకార్యానికి వెళ్తున్న ఎంపీ భరత్.. రమణ పాలిట దైవంగా మారారు. నిముషాల వ్యవధిలో అక్కడకు అంబులెన్స్‌ని పిలిపించి.. రమణ కుటుంబాన్ని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌తో పాటు ఎంపీ భరత్, ఆయన అనుచరులు, నాయకులు కూడా ఆసుపత్రికి వెళ్ళారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ‌

మరో వైపు భార్య మృతదేహాన్ని పట్టుకుని రోధిస్తున్న రమణను ఓదార్చి.. అర్తమూరు వెళ్ళేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఎంపీ భరత్ మానవత్వంతో స్పందించిన తీరుకు పలువురు అభినందిస్తున్నారు. కాగా, కోనసీమ జిల్లా అర్తమూరుకు చెందిన నిడదవోలు రమణ తన భార్య వీరలక్ష్మి (32), కుమారుడు వెంకట్ (16) కలిసి బైక్‌పై దేవరపల్లి మండలం గౌరీపట్నం వెళ్తుండగా.. వీరి వెహికిల్‌ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఢీకొట్టింది‌. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బ్రిడ్జిపై జరిగిన ఈ ప్రమాదంలో వీరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు వెంకట్ కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భార్య చనిపోయిందని గమనించని రమణ ఆమెను పట్టుకుని లేపుతున్న క్రమంలో అక్కడకు దైవంలా వచ్చిన ఎంపీ మార్గాని వారికి అన్నివిధాలా సహకరించారు.

Published on: Oct 01, 2023 08:54 PM