తీరం దాటిన మొంథా తుఫాను.. అల్లకల్లోలంగా సముద్రాలు
తీవ్రరూపం దాల్చిన మొంథా తుఫాను మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య ప్రశాంతంగా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను తీరాన్ని తాకినప్పటికీ, అంచనా వేసిన స్థాయిలో విధ్వంసం జరగకపోవడంతో ప్రజలు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నా, తుపాను కారణంగా విమాన, రైలు రవాణా సేవలు స్తంభించాయి. తీరం వెంట మొంథా తుఫాన్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. మొంథా ప్రభావంతో సముద్రతీరాలు ఉప్పొంగుతూనే ఉన్నాయి. ఎగిసిపడుతున్న అలలతో బంగాళాఖాతం కల్లోల్లంగా మారింది. తీరం వెంట గాలులు బలంగా వీస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి.. వానలు దంచికొడుతూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో గాలుల తీవ్రత మరింత పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్..నైరుతి బంగాళాఖాతాన్ని దాటి ,పశ్చిమ దిశ గా సాగి, గంటకు 15 కిమీ వేగంతో కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా కాకినాడ వైపు ప్రయాణించింది. కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర అర్ధరాత్రి 11:30-12:30 మధ్య తీరాన్ని దాటింది.క్లౌడ్ మాస్ ఎఫెక్ట్‌తో మరో రెండు రోజుల మొంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలో భారీనుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మత్స్యకారులు ఎవరూ రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. పోర్టుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథం. బుధ,గురువారాల వరకూ తీరం వెంట ఈదురుగాలులు ప్రభావం వుంటుంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇక రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు మొంథా ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే ??
రైలు నుండి జారిపడిన యువకుడు.. క్షణంలో..
వామ్మో.. ఈ దున్నపోతు ధర రూ.23 కోట్లట !! ఈ గుర్రం ధర రూ.15 కోట్లట
Kurnool bus tragedy: కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్
లివ్ ఇన్ పార్ట్‌నర్‌ను చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టింది
