మొంథా ఎఫెక్ట్‌.. పాఠశాలలకు సెలవు

Updated on: Oct 30, 2025 | 6:21 PM

మొంథా తుఫాను ఏపీ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం రాత్రి ఏపీలో నరసాపురం దగ్గర తీరం దాటినా మొంథా తుఫాన్‌ శాంతించలేదు. అది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినా, తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలతో ఏపీని వణికిస్తోంది. ఏపీలో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మొంథాతుఫాను ప్రభావంతో విశాఖ జిల్లా అతలాకుతలమైంది. బుధవారం కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు వరదపోటెత్తడంతో నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు గురవారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.విశాఖపట్నం జిల్లాలో పదో తరగతి వరకు అన్ని పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇటు అనకాపల్లి జిల్లాలోనూ గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాను పునరావాస కేంద్రాలను విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కేవలం ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవు ఉంటుందని, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఆ జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??

జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు

చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్‌

భారీగా నగలు ధరిస్తే.. రూ. 50 వేలు జరిమానా !

ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా ??