నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారికి నారా లోకేశ్ భరోసా!వీడియో
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు ప్రారంభించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని అధికారులు లోకేశ్‌కు వివరించారు. 4 ప్రాంతాల్లో సుమారు 190 మంది తెలుగు వారు చిక్కుకున్నట్లు తెలిపారు. గౌశాలలో 90 మంది, పశుపతి నగరంలో 55, బఫాల్‌లో 27, సిమిల్‌కోట్‌లో 12 మంది ఉన్నట్లు చెప్పారు. వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు తక్షణ సాయం, తరలింపుపై అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారితో మంత్రి నారా లోకేశ్ వీడియో కాల్‌లో మాట్లాడారు. సూర్యప్రభ అనే మహిళ అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి చిక్కుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని బాధితులకు లోకేశ్ భరోసా ఇచ్చారు. నేపాల్ టూర్‌కు వెళ్లిన విశాఖ ఎల్ఐసి ఉద్యోగులు పది మంది ప్రస్తుతం పోఖారాలోని ఓ హోటల్లో ఉన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన వారు ఏదైనా అత్యవసర సహాయం కోసం +91 9818395787, APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678, వాట్సప్: +91 8500027678, ఈ-మెయిల్: helpline@apnrts.com, ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణా హెల్ప్‌లైన్ నెంబర్ల విషయానికొస్తే +91 9871999044. +91 9643723157. +91 9949351270కు కాల్ చేయాల్సిందిగా మనవి.
మరిన్ని వీడియోల కోసం :
లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్ కపుల్.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో
ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
