Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది
తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సంప్రదాయబద్ధంగా ప్రారంభం అయింది. జాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరిగింది. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగగా.. బుధవారం ఉదయం మండమెలిగే పండగ నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించే ఈ మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్లు పూజారులు చెబుతారు.
తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సంప్రదాయబద్ధంగా ప్రారంభం అయింది. జాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరిగింది. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరగగా.. బుధవారం ఉదయం మండమెలిగే పండగ నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించే ఈ మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్లు పూజారులు చెబుతారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లిలోని సారలమ్మగుడి, పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయం, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి మండలు , వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకొనేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??
2025 నాటికి భారత్ రానున్న ఫ్లయింగ్ కార్స్ !! ఇంటిపైనే ల్యాండింగ్
PM Surya Ghar Yojana 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు.. కేంద్రం కొత్త పథకం ప్రారంభం