త్వరలో యుగాంతం? బంకర్లలోకి ధనవంతులు? వీడియో
ప్రపంచం అంతం కాబోతుందనే భయాలతో టెక్ దిగ్గజాలు మార్క్ జుకర్‌బర్గ్, సామ్ ఆల్ట్‌మాన్ రహస్య భూగర్భ బంకర్లను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ నియంత్రణ కోల్పోవచ్చనే ఆందోళనలతో ఈ ధనవంతులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇది ప్రపంచ విపత్తుకు ముందస్తు సంకేతమా అనే చర్చకు దారితీస్తోంది.
ప్రపంచం అంతం కాబోతుందా, ప్రళయం ముంచుకొస్తుందా అనే భయాలు సాధారణ వ్యక్తులకు వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ, టెక్ దిగ్గజాలు, ప్రపంచ ధనవంతులు ఇలాంటి ఆందోళనలతో ముందుగానే సన్నద్ధమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తన ఇంట్లోనే కాకుండా ప్రత్యేకంగా పెద్ద స్థలం కొనుగోలు చేసి భూగర్భంలో భారీ బంకర్‌ను నిర్మిస్తున్నారు. అదేవిధంగా, ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ కూడా ప్రపంచం అంతమైతే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అండర్‌గ్రౌండ్ బంకర్‌లను సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
