Gond Katira: గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?

|

Nov 14, 2024 | 11:12 AM

గోండ్ కటిరా అనేది ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలలో పెరిగే ఆస్ట్రాగలస్ కుటుంబానికి చెందిన మొక్కల నుండి తీసుకున్న పదార్థం. నీటితో కలిపినప్పుడు, ఇది జెల్లీ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. గోండు కటిరా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, డైటరీ ఫైబర్, మెగ్నీషియం వంటి అనేక మినరల్స్‌తో పాటు విటమిన్లు కూడా ఉంటాయి.

గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్.. కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. గోండ్ కటిరా.. జీర్ణక్రియ శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పురుషుల సంతానోత్పత్తికి కూడా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. గోండ్ కటిరా.. చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. వేసవిలో అరికాళ్లు, కాళ్ల మంట సమస్య ఉన్నవారు.. గోండు కటిరాను తీసుకుంటే సాంత్వన చేకూరుతుంది. అయితే, పెరుగు, గోండ్ కటిరా కలిపి తింటే మరీ మంచిది అంటున్నారు నిపుణులు.

పెరుగుతో గోండ్‌ కటిరాను కలిపి తింటే ఎముకలకు మంచి బలం. చాలా సేపు పొట్టను నిండుగా ఉంచి, త్వరగా బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. గోండ్ కటిరా ఒత్తిడిని తగ్గించడంలో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. పెరుగుతో కలిపి తినటం వల్ల రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా ఉంటారు. పెరుగుతో కలిపి గోండ్ కటిరాను తింటే అది మంచి నిద్రకు తోడ్పడుతుంది. ప్రశాంతమైన నిద్ర అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మీరు పెరుగుతో గోండ్‌ కటిరా తింటే ప్రయోజనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాతోనే వీటిని తీసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.