అమెరికా, కెనడాలలో సూర్యప్రతాప…!! రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు… ( వీడియో )

Phani CH

|

Updated on: Jul 03, 2021 | 6:36 AM

అమెరికా, కెనడా దేశాలలో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు.. వస్తే పోతామేమోనన్న భయం.. అందుకు కారణం కరోనా వైరస్‌ కాదు.. మండుతోన్న ఎండలు..

అమెరికా, కెనడా దేశాలలో జనం బయటకు రావడానికే భయపడిపోతున్నారు.. వస్తే పోతామేమోనన్న భయం.. అందుకు కారణం కరోనా వైరస్‌ కాదు.. మండుతోన్న ఎండలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదన్న హెచ్చరికలు జారీ అయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. అమెరికా, కెనడా దేశాలలో ఇది ఎర్లీ సమ్మర్‌.. అంటే వేసవి కాలానికి ఆగమనం చెప్పే సీజన్‌.. ఇప్పుడే అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నారు.. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లోనే ఉంటూ ఏసీలు వేసుకుంటూ గడిపేస్తున్నారు.. ఇప్పటికే కెనడాలో 240 మందికిపైగా వడగాలులకు మరణించారు. అమెరికాలోనూ ఎండవేడికి తాళలేక పదుల సంఖ్యలో మరణించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Visakhapatnam News: ఊర పందుల వాహనం హైజాక్‌..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..

ఎమ్మార్వో ఆఫీసు గుమ్మానికి మంగళసూతం కట్టి మహిళ వినూత్న నిరసన..!వైరల్ అవుతున్న వీడియో..:Rajanna Sircilla video.