కాక్‌పిట్‌లో హాహాకారాలు దొరికిన బ్లాక్‌బాక్స్.. ఆఖరి 11 నిమిషాల గుట్టు రట్టు ?
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందిన విమాన ప్రమాద దర్యాప్తులో 'బ్లాక్ బాక్స్' లభ్యం కావడం కీలక మలుపు. పైలట్ల చివరి క్షణాల సంభాషణలు, విమాన సాంకేతిక లోపాలు, ప్రమాదానికి దారితీసిన 11 నిమిషాల సంఘటనలను ఇది ప్రపంచానికి వెల్లడిస్తుంది. మానవ తప్పిదమా లేక యంత్ర లోపమా అనే దానిపై స్పష్టత బ్లాక్ బాక్స్ విశ్లేషణతోనే తెలుస్తుంది.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. కూలిన విమాన శకలాల మధ్య ‘బ్లాక్ బాక్స్’ దొరికింది. మరణానికి ముందు పైలట్లు పడ్డ టెన్షన్‌ను, విమానంలో సాంకేతిక లోపాలను బ్లాక్ బాక్స్ ప్రపంచానికి చెప్పనుంది. అయితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినా పైలట్లు సమాధానం ఇవ్వకపోవడం.. ఆ వెంటనే కాక్‌పిట్‌లో వినిపించిన ఆర్తనాదాల వెనుక అసలు కథేంటో దీని ద్వారానే తెలియనుంది. సాధారణంగా విమానాల్లో రెండు రకాల రికార్డర్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం ఎత్తు, వేగం, ఇంజిన్ పనితీరును నమోదు చేస్తుంది. రెండోది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను రికార్డ్ చేస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం ఇప్పుడు ఈ రెండింటినీ విశ్లేషించనుంది. దీని ద్వారానే విమానం కూలిపోవడానికి ముందు సాంకేతిక లోపం తలెత్తిందా లేక మానవ తప్పిదమా అనే దానిపై స్పష్టత వస్తుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. బారామతిలో బుధవారం ఉదయం కుప్పకూలిన లియర్ జెట్ 45 విమానానికి సంబంధించిన ‘బ్లాక్ బాక్స్’ను పరిశోధక బృందాలు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నాయి. ప్రమాదం జరిగిన 24 గంటల తర్వాత.. సంఘటనా స్థలంలోనే ఈ బ్లాక్ బాక్స్ దొరికినట్లు అధికారులు చెబుతున్నాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్.. అజిత్ పవార్ సహా ఐదుగురి ప్రాణాలు పోవడానికి ముందు 11 నిమిషాల పాటు ఏం జరిగిందో చెప్పనున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బుధవారం ఉదయం 8.10 గంటలకు అజిత్ పవార్ విమానం బారామతికి బయలు దేరింది. అయితే రన్‌వే 11పై దిగడానికి ప్రయత్నించినప్పుడు రన్‌వే కనిపించకపోవడంతో పైలట్లు ‘గో-అరౌండ్’ చేశారు. కొద్దిసేపటి తర్వాత రన్‌వే కనిపిస్తోందని పైలట్లు ధృవీకరించడంతో.. 8:43 గంటలకు ఏటీసీ ల్యాండింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ల్యాండింగ్ అనుమతి లభించిన తర్వాత పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత సరిగ్గా నిమిషానికే.. అంటే 8:44 గంటలకు రన్‌వే ప్రారంభంలో మంటలు ఎగసిపడటాన్ని ఏటీసీ గమనించింది. వెంటనే సహాయక బృందాలను అప్రమత్తం చేసింది. బారామతి ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ కంట్రోల్‌ను ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీలకు చెందిన క్యాడెట్ పైలట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏవైనా కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయా? లేదా లియర్ జెట్ 45 విమానంలో ఏదైనాసాంకేతిక లోపం తలెత్తిందా? అనే విషయాలు బ్లాక్ బాక్స్ విశ్లేషణతో తేలనున్నాయి. అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, అటెండెంట్, ఇద్దరు పైలెట్లు కూడా ఈ ప్రమాదంలో మరణించడంతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం ఏఏఐబీ సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కేసులో అత్యంత కీలకంగా మారనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోమోస్ షాపులో అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
Gold Price: పసిడి పరుగులకు బ్రేక్.. ఒక్క రోజులోనే భారీ క్షీణత
Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు
కలచివేస్తున్న నాంపల్లి అగ్నిప్రమాద బాధితుల ఆఖరి ఆడియో
Harish Rao: ఢిల్లీ మీటింగ్‌ను బహిష్కరించండి.. హరీష్ రావు డిమాండ్