Loading video

హాయిగా నిద్రపోవాలంటే ఈ 6 మీ లిస్ట్​లో ఉండాలి వీడియో

|

Mar 24, 2025 | 3:15 PM

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని ర‌కాల పోష‌కాలతో నిండిన ఆహారాన్ని రోజూ తినాల్సి ఉంటుంది. మ‌న శ‌రీరానికి అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం అవుతాయి. ఇక మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన మిన‌ర‌ల్స్‌లో మెగ్నిషియం కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. కండ‌రాల ప‌నితీరుకు, ఎముక‌లు ఆరోగ్యంగా ఉండేందుకు మెగ్నిషియం అవ‌స‌రం అవుతుంది. నిద్ర కూడా బాగా పట్టేలా సహకరిస్తుంది.

మెగ్నిషియం కావాలంటే ట్యాబ్లెట్స్‌ వాడాల్సిన ప‌నిలేదు. ఖ‌రీదైన చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప‌దార్థాల్లోనే స‌హ‌జ‌సిద్ధంగా మెగ్నిషియం ల‌భిస్తుంది. బాదంప‌ప్పులో మెగ్నిషియం స‌మృద్ధిగా ఉంది. 100 గ్రాముల బాదంప‌ప్పులో 270 మిల్లీగ్రాముల మెగ్నిషియం ల‌భిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా మారుతాయి. కండ‌రాల పనితీరు మెరుగు ప‌డుతుంది. బాదంప‌ప్పును రోజూ తింటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. అలాగే గుమ్మడికాయ విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మెగ్నిషియం పొంద‌వ‌చ్చు. 100 గ్రాముల గుమ్మడికాయ విత్తనాల‌ను తింటే సుమారుగా 168 మిల్లీగ్రాముల మెగ్నిషియం ల‌భిస్తుంది. గుమ్మడికాయ విత్తనాల‌ను తిన‌డం వ‌ల్ల నాడీ వ్యవస్థ ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మ‌న‌స్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్రలోకి జారుకుంటారు.